ఏపి హిస్టారికల్ ప్రైవేట్ వ్యాక్సినేషన్ డ్రైవ్..

న్యూస్4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి ప్రైవేట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ( కో వ్యాక్సిన్ ) ఈ రోజున రాజమండ్రిలో ప్రతిష్టాత్మకంగా రాజీవ్ గాంధీ విద్యాసంస్థల నందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచితంగా జరిగింది. ఇందులో భాగంగా మాజీ ఎంపీ హర్షకుమార్ గారు మాట్లాడుతూ ” కాంగ్రెస్ పార్టీ ఈ రోజున కార్యకర్త సంక్షేమానికి ప్రత్యేక దృష్టి సాధించిందని, మొదటి నుండి కూడా రాహుల్ గాంధీ కరోనా విజృంభన గురించి ఎంతో బాధ్యత గల పౌరుడిగా కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో సూచనలు చేశారని. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏ సూచన మీద కూడా ప్రత్యేక దృష్టి సాధించలేదని. దాని వల్లనే కరోనా ఈరోజున దేశంలో ఇంత విజృంభణ కావడానికి గల ముఖ్య కారణమని హర్ష కుమార్ గారు పత్రికాముఖంగా తెలిపారు, ప్రధానమంత్రి మోడీ కనీసం వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు కి ఒక్క రూపాయి నిధి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం చేయలేదని అసలు బీజేపి ప్రభుత్వానికి గానీ మోడీ కి గాని ప్రజలంటే పట్టింపు లేదని హర్ష కుమార్ గారు బిజెపి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ లీడర్ జీవీ శ్రీ రాజ్ వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ రోజున చేశారు రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఈరోజు ప్రతి కుటుంబానికి ఉచితంగా వ్యాసం ప్రక్రియ చాలా గర్వ కారణంగా సాగింది.

ఈ కార్యక్రమంలో రాజమండ్రి యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ మాజీ ఉపాధ్యక్షులు మరి గేట్ కిరణ్, కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, చర్చ్ పేట రవి, కొల్లాపూర్ ప్రసాద్ పాల్గొన్నారు.

ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియకి జిల్లా వైద్య అధికారుల నుండి ఇన్స్పెక్షన్ సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి ప్రైవేట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేయుటకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు శ్రీ రాజు తెలిపారు, ప్రైవేట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రక్రియ కు దరఖాస్తు చేసుకున్న వెంటనే, ఎడిషనల్ dm&ho కోమలి గారు ఒక కమిటీని ఇన్ఫెక్షన్కు పంపించారని ఇన్స్పెక్షన్ కమిటీ వచ్చి చెక్ చేసిన తర్వాత అన్ని నిబంధనలు పాటించడం తో రాజమండ్రి కిమ్స్ హాస్పటల్ నుండి వ్యాక్సిన్ ఖరీదు చేసి ఈరోజు వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ హాస్పటల్ యాజమాన్యానికి జిల్లా హెల్త్ అధికారులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *