న్యూస్4: విశాఖపట్నం: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి జిల్లా నూతన చైర్మన్ గా వైద్యులు శివ నాగేంద్ర రెడ్డి నియమితులయ్యారు. ఇదివరకు చైర్మన్ గా కొనసాగిన డా.వేణుగోపాల్ గత నెలలో మృతి చెందగా ఆయన స్థానంలో డాక్టర్ శివ నాగేంద్ర రెడ్డి ని కమిటీ సభ్యులు ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు.గతంలో కూడా డాక్టర్ శివ నాగేంద్ర రెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలలో ప్రత్యక్షంగా అలానే పరోక్షంగా కూడా ఎన్నో సేవలందించారు. జాతీయ, అంతర్జాతీయ వైద్యులకు వైద్య సేవలో తర్ఫీదు నందించి తమ వైద్య నైపుణ్యతలో నాన్ స్టాప్ సర్జరీ లను చేసి ప్రపంచ రికార్డ్ పురస్కారాలను కూడా వైద్యులు శివ నాగేంద్ర రెడ్డి అందుకున్నారు. కాగా నిన్న జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ను డాక్టర్ శివ నాగేంద్రరెడ్డి తమ రెడ్ క్రాస్ టీమ్ సభ్యులు కార్యదర్శి శ్రీనివాసరావు, పిఆర్వో రావ్ లతో కలిసి ఐఆర్సియస్ విధి విధానాలను చర్చించారు. అనంతరం తమ స్థానాన్ని భర్తీ చేసి డా.శివనాగేంద్ర రెడ్డి ఛార్జ్ తీసుకున్నారు.
