“ది పేషన్ ఆఫ్ ది క్రైస్ట్” హీరో జిమ్ కేవిజెల్ పుట్టిన రోజు..

న్యూస్4 : “ది పాషన్ ఆఫ్ ది క్రైస్ట్” సినిమా షూటింగ్ సమయంలో, జిమ్ కేవిజెల్ (యేసు క్రీస్తు పాత్రను పోషించాడు) 20. 1/2 కిలోల బరువు ను కోల్పోయాడు,అనేక మార్లు దెబ్బలు తగిలాయా, అనుకోకుండా రెండుసార్లు కొరడాతో కొట్టబడడం వలన 14 అంగుళాల లోతైన గాయాలు తాలూకా మచ్చలు కలిగాయి, భుజం స్థానభ్రంశం చెందిన పరిస్థితి ఎదుర్కొన్నాడు. బయట ఎండలో చాలా గంటలు సిలువపై ఎక్కువగా నగ్నంగా వేలాడదీయడం వలన న్యుమోనియాతోను మరియు అల్పోష్ణస్థితితో(తగినంత ఆక్సిజన్ అందని స్థితి) బాధపడ్డాడు. సిలువ వేయబడిన సన్నివేశం ఒక్కటే 2 నెలల చిత్రీకరణ సమయములో 5 వారాలు పాటు తీయవలసి వచ్చింది. ఆ కారణము చేత అతని శరీరం చాలా ఒత్తిడికి గురైంది. షూటింగ్ పూర్తి అయిన తర్వాత 2 సార్లు ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయవలసి వచ్చింది!.

ది పాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అన్ని సమయాలలోఅత్యధిక వసూళ్లు చేసిన రికార్డును సొంతం చేసుకున్న చిత్రం. ఆ దినాలలో అమెరికాలో 1742.7కోట్లు రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా ఇది 54,571.7 కోట్ల రూపాయలను వసూలు చేసింది. మరీ ముఖ్యంగా, ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆత్మలకు చేరుకుంది. మెల్ గిబ్సన్ ఈ సినిమా కోసం తన సొంత జేబులో నుండి 141 కోట్ల రూపాయలు చెల్లించాడు, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ను తీసుకోవడానికి ఏ స్టూడియో ముందుకు రాలేదు, మరియు జిమ్ కేవిజెల్ ను యేసు క్రీస్తు పాత్రను చేయవద్దని హాలీవుడ్ చేత హెచ్చరించ బడ్డాడు. ఎందుకంటే ఇది అతని భవిష్యత్ సినీ జీవితం నాశనం చేస్తుంది.

ఈ రోజు జిమ్ కేవిజెల్ పుట్టినరోజు, మరియు అతని వయస్సు 51 సంవత్సరాలు. దైవభక్తి లేని హాలీవుడ్ పరిశ్రమ మధ్య అతను క్రీస్తుపై గల తన విశ్వాసాన్ని గర్వంగా ప్రకటించాడు.
“సరదాగా” అనిపించని వాటిని చేయటానికి బయలుదేరిన ఇతనిలాంటి వ్యక్తులను బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈ సినిమా దేవుని వాక్యాన్ని మరియు మానవజాతి యొక్క మోక్షానికి సంబంధించిన విషయాలను ఈ లోకానికి అందించింది.
పుట్టినరోజు శుభాకాంక్షలు, జిమ్ కేవిజెల్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *