న్యూస్4: విశాఖపట్నం: ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గా విశ్వవిభూషన్ హారిచందన్ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపి రెడ్ క్రాస్ ఆధ్వర్యాన విశాఖ జిల్లా రెడ్ క్రాస్ శాఖ 15 గ్రహణం మొర్రి శస్త్ర చికత్సలను విశాఖ దుర్గా హాస్పటల్ లో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ వైద్యులు వై. శివ నాగేంద్ర రెడ్డి పూర్తి ఉచితంగా స్వయంగా నిర్వర్తించి రోగులకు బోజనం మరియు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రహణం మొర్రి తో ఎంతో మంది తమ జీవితాలపై ఆశలను వదిలి మనస్తాపానికి గురై ఇటు అంగవైకల్యం కి చెందక అటు ఎటువంటి ప్రభుత్వ రిజర్వేషన్ల ను అందుకోలేక ఎటువంటి ఉపాధి లేని స్థితిలో అల్లాడుతున్నారు అని ఇలాంటి వారి కొరకు ఇప్పటి వరకు వేల సంఖ్యలో ఉచిత శస్త్ర చికిత్సలను నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు.ఇక కోవిడ్ 19 విపత్కర పరిణామంలో రక్తం కొరత, రక్త దాన ప్రాధాన్యత పై పూర్తి అవగాహన కలిగేలా వైద్యులు శివ నాగేంద్ర రెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో దుర్గా హాస్పటల్ చైర్మన్ ఎం.వి. రెడ్డి పాల్గొన్నారు.
