శ్రుతిహాసన్ మహేష్ బాబు ఛాలెంజ్ తో నాటిన మూడు మొక్కలు

న్యూస్4అజ్: సూపర్ స్టార్ మహేష్ బాబు ఛాలెంజ్ ని స్వీకరించి చెన్నై లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటిన ప్రముఖ సినీనటి శృతిహాసన్…రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల ప్రముఖులు ఒకరికొకరు ఛాలెంజ్ విసురుకుంటు తమవంతు బాధ్యతగా మొక్కలు నాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు తన జన్మదిన సందర్భంగా అలాగే రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించిన లేడి సూపర్ స్టార్ కమలహాసన్ తనయా శృతి హాసన్ ఈ రోజు చెన్నైలో ని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తననీ నామినేట్ చేసిన మహేష్ బాబు కి అలాగే దేవిశ్రీప్రసాద్ కి ధన్యవాదాలు తెలిపారు. మొక్కలు నాటిన శృతి హాసన్ మరో ముగ్గురిని నామినెట్ చేశారు.వారిలోబాలీవుడ్ సూపర్ స్టార్ హ్రితిక్ రోషన్,హీరోయిన్ తమన్నా, మరియు రానా దగ్గుబాటి ఉన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *