జగన్ గా అక్కినేని నాగార్జున…

న్యూస్4అజ్: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కూ.. సినీ నటుడు నాగార్జునకూ మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ పాత్రలో నాగార్జున నటించబోతున్నాడన్న పుకార్లు ఫిల్మ్ నగర్లో షికారు చేస్తున్నాయి. అసలు జగన్ పాత్ర ఏంటి అంటారా.. ఆ మధ్య మహి వి రాఘవ దర్శకుడిగా యాత్ర అనే సినిమా వచ్చిన సంగతి తెలుసు కదా.. మమ్ముట్టి వైఎస్‌ గా నటించిన ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. ఓ బయోగ్రఫీలా కాకుండా కమర్షియల్ మూవీగా మహి బాగా తీశాడన్న పేరు సంపాదించుకున్నాడు.ఆ సినిమా తర్వాత మళ్లీ మహి వేరే సినిమా ఏమీ చేయలేదు. ఇప్పుడు అతడు యాత్ర 2 సినిమాకు స్క్రిప్టు రెడీ చేస్తున్నాడు. యాత్ర సినిమాను పూర్తిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర మీదే ఫోకస్ చేశారు.కానీ ఇప్పుడు యాత్ర 2 వైఎస్ మరణంతో మొదలై.. అక్కడి నుంచి జగన్ సీఎం అయ్యే వరకూ ఉంటుందట. అంటే మొదటి సినిమాలో హీరో పాత్ర వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిదైతే.. యాత్ర 2 సినిమాలో హీరో పాత్ర వైఎస్‌ జగన్‌ ది అన్నమాట.మొదటి యాత్ర సినిమాలో వైఎస్ పాత్రకు మమ్ముట్టి సరిగ్గా సరిపోయారు. ఆయన పూర్తిగా వైఎస్ పాత్రలో లీనమయ్యారు. ఇప్పుడు యాత్ర 2 లో కూడా అలాంటి బాడీ లాంగ్వేజ్ ఇవ్వగల నటుడి కోసం మహి వెదుకుతున్నారు. ఆ అన్వేషణ నటుడు నాగార్జునతో పూర్తయిందని భావిస్తున్నారు. ఇందుకు నాగార్జున కూడా ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ఒక వేళ యాత్ర 2 లో నాగార్జున నటిస్తే మాత్రం ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడం ఖాయం.దీనికితోడు.. మొదటి యాత్ర సినిమాలో పెద్దగా కాంట్రవర్సీలు లేవు. అంతా వైఎస్ పాదయాత్ర ప్రధానంగా సాగింది. అందులోనూ.. ఆ సినిమాలో విలన్ రోల్స్‌ కూడా పెద్దగా లేవు. కానీ యాత్ర 2 విషయానికి వస్తే.. అది జగన్ జీవిత యాత్ర అవుతుంది కాబట్టి.. అందులో చంద్రబాబు, సోనియా వంటి పాత్రలు ఉంటాయి. మరి వాటికి ఎవరిని సెలక్ట్ చేస్తారన్నది కూడా ఆసక్తికరమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *